సికింద్రాబాద్ : గాంధీ ఆస్పత్రిలో పేద రోగులకు చేయూతను అందించాలనే లక్ష్యంతో అర్పన్,రోగి సహాయత స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం ఎనలేనిది గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ వాణి తెలిపారు. గాంధీ ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్ విభాగంతో పాటు ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఆపరేషన్ థియేటర్ లకు మరమ్మత్తులు చేసి ఆధునికరించి ప్రారంభోత్సవం చేశారు.అర్పన్, రోగి సహాయత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి గాంధీ ఆసుపత్రి సూపర్డెంట్ వాణి ఆయా విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ సూపర్డెంట్ వాణి మాట్లాడుతూ గాంధీ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజల వైద్య చికిత్సల కోసం అధునాతన పద్ధతిలో రూపుదిద్దుకున్న ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలకు స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించడం సంతోషకరమని అన్నారు. గాంధీ ఆసుపత్రి పేదలకు వైద్యం అందించేందుకు వైద్యులు, ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం తోడవడం మూలంగా మెరుగైన వైద్యం అందించవచ్చని తెలిపారు. సిఎస్ఆర్ నిధుల కింద 39 లక్షలతో అత్యవసర విభాగాలైన ఆర్థోపెడిక్ ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ థియేటర్లను మరమ్మతులు చేపట్టడం జరిగిందని అన్నారు.
Sidhumaroju