Sunday, October 12, 2025
spot_img
HomeSouth ZoneTelanganaఅల్వాల్ రెడ్డి సంఘం అభివృద్ధికి ఎమ్మెల్యే చేయూత.

అల్వాల్ రెడ్డి సంఘం అభివృద్ధికి ఎమ్మెల్యే చేయూత.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   అల్వాల్ సర్కిల్‌లోని తోట పెంటా రెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన రెడ్డి జన సంఘం సమ్మేళనంలో మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మచ్చ బొల్లారంలో రెడ్డి కుల సంఘ భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించారు. రెడ్డి సామాజిక వర్గం ఐక్యంగా ముందుకు సాగాలనే సంకల్పంతో సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ, భవిష్యత్‌ లో మరింత అభివృద్ధి దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ రెడ్డి భవనం పేద ప్రజలకు ఎల్లవేళల ఉపయోగపడే విధంగా ఉండాలని ఆకాంక్షించారు కుల సంఘ ఐక్యతను ప్రతిబింబించే ఈ సమ్మేళనం, భవిష్యత్‌లో సామాజిక శ్రేయస్సు కోసం మరిన్ని కార్యక్రమాలకు ప్రేరణగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జన సంఘ సభ్యులు గుమ్మడి ఆనంద్ రెడ్డి, కౌకుంట్ల శ్రీధర్ రెడ్డి,తోట దేస్వంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ,చింతల మాణిక్య రెడ్ తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments