ఎన్టీఆర్ జిల్లాలో మాజీ మంత్రి జోగి రమేష్‌పై మరో అక్రమ కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారీ డెన్‌ను పరిశీలించిన జోగి రమేష్, టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధులకు అడ్డంకి కలిగించారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ ఎస్‌ఐ పెద్దిరాజు ఫిర్యాదు మేరకు జోగి రమేష్‌తో పాటు మరో 25 మందిపై కేసు నమోదైంది.
ఈ కేసు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యల భాగంగా ఉందని వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయంగా ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.