ఢిల్లీ నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం చారిత్రక కట్టడాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఎర్రకోట గోడలు నల్లగా మారిపోతున్నాయి.
సౌందర్యాన్ని కోల్పోవడంతో పాటు నిర్మాణ పటిష్టత కూడా దెబ్బతింటున్నట్లు ఇండో–ఇటాలియన్ శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో వెల్లడైంది. కాలుష్య కణాలు, ఆక్సైడ్లు గోడలపై పేరుకుపోయి రంగును మార్చడమే కాక, రాళ్ల బలాన్ని కూడా తగ్గిస్తున్నాయని వారు హెచ్చరించారు.
మెయింటెనెన్స్, శుద్ధి చర్యలు, కాలుష్య నియంత్రణ చర్యలు తక్షణమే చేపట్టాలని సూచించారు. కేంద్ర పర్యాటక శాఖ ఈ అంశంపై స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.