బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 08న హైకోర్టులో జీవో 9పై విచారణ జరగనుంది. ఇప్పటికే 50 శాతం దాటిన రిజర్వేషన్లతో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో, ఈ విచారణ స్థానిక ఎన్నికల భవితవ్యాన్ని ప్రభావితం చేయనుంది.
ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించనుండగా, ప్రముఖ న్యాయవాదులు ఎ. సుదర్శన్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ కూడా విచారణలో పాల్గొననున్నారు.
హైకోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందా లేదా అనేది తేలనుంది. ఈ పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా ఆసక్తి నెలకొంది.