హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ శాఖ వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. రద్దీ ప్రాంతాల్లో వాలంటీర్లను నియమించి ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోంది.
ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలు, బస్టాండ్లు, జంక్షన్లు వంటి ప్రాంతాల్లో వాలంటీర్లు విధులు నిర్వహించనున్నారు. ప్రజల సహకారంతో ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించేందుకు ఇది ఒక ప్రయోగాత్మక చర్యగా భావిస్తున్నారు.
వాలంటీర్లకు ప్రాథమిక శిక్షణ ఇచ్చి, ట్రాఫిక్ పోలీసులకు తోడుగా పనిచేయనున్నారు. హైదరాబాద్‌లో ఈ విధానం విజయవంతమైతే, ఇతర జిల్లాల్లోనూ అమలు చేసే అవకాశం ఉంది.