హైదరాబాద్ పశ్చిమ భాగంలో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూముల వేలం దేశ రియల్ ఎస్టేట్ రంగాన్ని కదిలించింది. టీజీఐసీసీ నిర్వహించిన వేలంలో కొండపై ఉన్న భూమికి ఎకరానికి రూ.177 కోట్లు పలకడం సంచలనంగా మారింది.
గతంలో కోకాపేట నియోపొలిస్‌లో రూ.100.75 కోట్ల ధరే ఆశ్చర్యాన్ని కలిగించగా, తాజా వేలం ఆ రికార్డును మించిపోయింది. దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఈ స్థలం వ్యూహాత్మకంగా ఉండటంతో, అభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
పశ్చిమ హైదరాబాద్‌లో బహుళ అంతస్తుల భవనాలతో పాటు భూముల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ వేలం భవిష్యత్ ప్రాజెక్టులకు దిశానిర్దేశం చేస్తుందని రియల్టీ రంగం భావిస్తోంది.