ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ ఆధునిక సాంకేతికత వైపు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అన్ని సబ్‌స్టేషన్లను స్కాడా వ్యవస్థ ద్వారా ఆటోమేటెడ్‌గా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది.
విజయవాడలోని 12 సబ్‌స్టేషన్లు ఇప్పటికే మానవరహితంగా పనిచేస్తుండగా, గుణదలలో ఏర్పాటు చేసిన SCADA కేంద్రం ద్వారా వాటిని నియంత్రిస్తున్నారు. ఈ విధానం ద్వారా విద్యుత్ సరఫరా వేగంగా, ఖచ్చితంగా నిర్వహించబడుతుంది.
సిబ్బంది అవసరం లేకుండా, సీసీ కెమెరాలు, సెన్సర్లు, డిజిటల్ పరికరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది. ఇది విద్యుత్ ట్రిప్, మరమ్మతుల సమయంలో ప్రమాదాలను తగ్గించడంలో కీలకంగా మారనుంది.