భారతదేశ ఔషధ రంగానికి శుభవార్త. జనరిక్ మందులపై అమెరికా ప్రభుత్వం టారిఫ్‌లు విధించబోనని శ్వేత సౌధం ప్రకటించింది.
సెక్షన్ 232 కింద ఈ అంశంపై చర్చకు ట్రంప్ కార్యవర్గం ఆసక్తి చూపడం లేదని ప్రతినిధి కుష్ దేశాయ్ తెలిపారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నిర్ణయం భారత ఔషధ కంపెనీలకు భారీ ఊరటను కలిగించనుంది.
అయితే అక్టోబర్ 1న బ్రాండెడ్ ఔషధాలపై సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు ఔషధ రంగంలో వ్యాపార అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి.