మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నం పర్యటనకు సంబంధించి పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు.
నిర్దేశించిన మార్గాన్ని వదిలి వేరే దారిలో ప్రయాణించడం, వాహనశ్రేణిని తరచూ ఆపడం, భారీ జన సమీకరణ ఏర్పరచడం వంటి చర్యలు జరిగితే, ఆయన పర్యటనకు ఇచ్చిన అనుమతి స్వయంగా రద్దవుతుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఈ నిబంధనలు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.
నర్సీపట్నం పోలీస్ శాఖ ఈ విషయాన్ని గంభీరంగా తీసుకుంటోంది. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే చర్యలు జరిగితే, క్రిమినల్ చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు.