గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోవడంతో బాలింతలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూని ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన సామాగ్రి పరికరాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆపరేషన్లు చేసే ప్రక్రియ నిలిచిపోయింది. గతంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కుని శాస్త్ర చికిత్సలకు అవసరమైన ఆపరేషన్ థియేటర్ సామాగ్రి విశ్రాంతి తీసుకునేందుకు గదులు బెడ్లు అందుబాటులో ఉండేవి. ఆసుపత్రిలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ల ద్వారా మహిళలకు కుని ఆపరేషన్ లను వైద్య శాఖ చేయించేది. మెడికల్ ఆఫీసర్లు కూని ఆపరేషన్లు చేస్తున్నడంతో కొన్ని సెంటర్లలో ఆపరేషన్ వికటించి మహిళలు మృతి చెందటం పట్ల వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొని ఆపరేషన్లను నిలిపి వేసింది. కేవలం సి హెచ్ సి ఏరియా జనరల్ ఆసుపత్రులకు మాత్రమే చేయాలని నిబంధన విధించడంతో మహిళలు అవస్థలు పడుతున్నారు. గతంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ బెలగల్ కోడుమూరు మండలాల నుంచి కొని ఆపరేషన్లు చేయించుకునేందుకు మహిళలు వచ్చేవారు. అయితే ప్రభుత్వం డిజి ఓలు మాత్రమే ఆపరేషన్ చేయాలని నిబంధన పెట్టడంతో గత ఆరు సంవత్సరాలుగా కుని ఆపరేషన్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ తో పాటు అవసరమైన పరికరాలు ఉన్నప్పటికీ ఉపయోగం లేక మూలన పడ్డాయి. దీంతో పోనీ ఆపరేషన్ చేయించుకునేందుకు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేందుకు మహిళలకు ఆర్థికంగా భారం పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వారంలో రెండు మాటలు కూని ఆపరేషన్లు జరిపించేందుకు చర్యలు తీసుకొని అవసరమైన డీజీవో ని యమించాలని గూడూరు,సి.బెళగల్ మండల ప్రజలు కోరుతున్నారు.