ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. రైతు సేవా కేంద్రాలను రీ-ఓరియెంటేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ప్రకృతి అనుకూలంగా సాగు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, మరియు తూర్పు గోదావరి జిల్లాల్లో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
సేంద్రియ పద్ధతుల ద్వారా భూమి ఫలద్రత పెరగడం, ఖర్చులు తగ్గడం వంటి ప్రయోజనాలను రైతులకు వివరించాలని అధికారులకు సూచించారు. ఇది వ్యవసాయ రంగంలో ఒక సానుకూల మార్పుకు దారి తీస్తుంది.