గాజా యుద్ధ విరమణ ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన మొదటి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ సంతకం చేయడాన్ని ఆయన స్వాగతించారు.
ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేసిన మోదీ, ఇది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమర్థ నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. హమాస్ చేతిలో బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదలవుతారని ఆకాంక్షించారు.
గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయం అందుతుందని, శాశ్వత శాంతికి ఇది బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.