గ్రీస్ దేశం ఉద్యోగావకాశాల కోసం భారతదేశం నుంచి అర్హత కలిగిన అభ్యర్థులను కోరుతోంది. డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
టామ్ కామ్ సంస్థ ద్వారా వెయ్యికి పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. జీతం రూ.92,000 నుంచి రూ.1.5 లక్షల వరకు ఉండనుంది. గ్రీస్ అధికారులు టామ్ కామ్‌ను సంప్రదించి, నిరుద్యోగులను పంపాలని అభ్యర్థించారు.
అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలని సంస్థ సూచించింది. ఇది విదేశీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు గొప్ప అవకాశం.