సికింద్రాబాద్: శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్ల అయిన ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కంసారీ బజార్ చోటుచేసుకుంది. తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఇంటి ప్రహరీ గోడదూకి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కంసారీ బజారుకు చెందిన రామచందర్ అనే వృద్ధుడి ఇంట్లో దొంగతనం జరిగినట్లు బేగంపేట ఏసిపి గోపాల కృష్ణమూర్తి తెలిపారు. తన మనవరాలి జన్మదిన వేడుకల కోసం సోమవారం మహబూబ్ నగర్ కు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. గేటుకు తాళం వేసి ఉన్నప్పటికీ గూడ దూకిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాతారాలు పగలగొట్టి అందులో ఉన్న 8 తులాల బంగారంతో పాటు 50 వేల నగదు అపహరణ చేసుకొని పరారైనట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడంతో పాటు సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు బేగంపేట్ ఏసీపీ గోపాల కృష్ణమూర్తి వెల్లడించారు. 2011లో కూడా తమ ఇంట్లో ఇదే విధంగా చోరి అప్ప్పుడు కూడా 8తులాల బంగారం, అరకిలో వెండి నగదు చోరీ జరిగిందని, ఇప్పటి వరకు తమకు ఎటువంటి న్యాయం జరగలేదని, మళ్ళీ అదే తరహా చోరీ జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.
Sidhumaroju