హైదరాబాద్: సుప్రీం కోర్టు తాజా తీర్పుతో టీచర్లకు టెట్ పరీక్ష రాసే అవకాశం కలిగింది. నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
సెప్టెంబర్ 1, 2025న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, టెట్ అర్హత లేకుండా ఉపాధ్యాయులుగా కొనసాగడం ఇక సాధ్యపడదు. పదవీ విరమణకు ఐదేళ్లకు మించిన సేవా కాలం ఉన్న ఉపాధ్యాయులు కూడా రెండు సంవత్సరాల్లో టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిందే. కొత్త నియామకాలు, పదోన్నతుల కోసం టెట్ తప్పనిసరి అర్హతగా మారింది.
ఈ నిర్ణయం విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకంగా మారనుంది. రాష్ట్ర విద్యాశాఖ నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్ లేదా జనవరిలో పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.