ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపరిచే దిశగా ఏపీ స్కిల్ యూనివర్సిటీ కీలక ముందడుగు వేసింది.
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించేందుకు అంతర్జాతీయ సంస్థ సీమెన్స తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ద్వారా ఇంజినీరింగ్, సాంకేతిక విద్యార్థులకు అత్యాధునిక సాంకేతికతలలో పరిశ్రమ ఆధారిత శిక్షణ లభిస్తుంది. ప్రత్యేకించి, ఆటోమేషన్, డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాలలో ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించి, వారిని తక్షణ ఉద్యోగానికి సిద్ధం చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
విశాఖపట్నం జిల్లాలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.
ఈ భాగస్వామ్యం రాష్ట్ర యువతకు బంగారు భవిష్యత్తును అందిస్తుందని అధికారులు తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానంలో అంతరం తగ్గించి, నిపుణులైన శ్రామిక శక్తిని తయారుచేయడానికి ఈ ఒప్పందం ఎంతో కీలకం.