ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పారిశ్రామిక విజయం దక్కింది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), రూ. 96,862 కోట్లకు పైగా పెట్టుబడితో నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనుంది.
ఈ ‘అల్ట్రా-మెగా’ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 6,000 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం జనవరి 2029 నాటికి పూర్తవుతుందని అంచనా.
రాష్ట్ర ప్రభుత్వం 20 సంవత్సరాల కాలంలో పెట్టుబడి వ్యయంలో 75% వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సిద్ధమైంది.
దీని ద్వారా నిర్మాణ దశలో వేల మందికి, కార్యకలాపాల సమయంలో 3,750 మందికి పైగా శాశ్వత ఉద్యోగాలు లభించనున్నాయి.