ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (DCC Bank) నేడు, అక్టోబర్ 10న, దీపావళి మరియు సహకార వారం సందర్భంగా ‘సహకార ఉత్సవ్’ అనే కొత్త డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది.
ముఖ్యంగా కుర్నూలు జిల్లా ప్రజలకు మరియు సీనియర్ సిటిజన్లకు మరింత ప్రయోజనం అందించే లక్ష్యంతో ఈ పథకం రూపొందించబడింది.
ఈ ప్రత్యేక పథకంలో 666 రోజుల కాలవ్యవధికి డిపాజిట్ చేస్తే, సాధారణ ప్రజలకు 7.60% (నికరంగా 8.07%) చొప్పున, సీనియర్ సిటిజన్లకు ఏకంగా 8.10% (నికరంగా 8.64%) చొప్పున అధిక వడ్డీ లభిస్తుంది.
అయితే, ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే.
నవంబర్ 11 వరకు మాత్రమే ఈ డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఈ అవకాశం వినియోగించుకుని జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకోవాలని బ్యాంకు కోరుతోంది.