పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని రేషన్ దుకాణాలు రోజుకు 12 గంటల పాటు పనిచేయనున్నాయి. ఇప్పటివరకు రెండు విడతలుగా పనిచేసిన ఈ దుకాణాలు, ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరంతరంగా అందుబాటులో ఉంటాయి. ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా తిరుపతి, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ నగరాల్లో అమలు చేస్తున్నారు. లబ్ధిదారులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు, సమయపాలన లోపాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రేషన్ దుకాణాలను మినీమాల్స్‌గా అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.