ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు “పీఎం ధన్ ధాన్య కృషి యోజన” పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా ఉంది.
సాగు పద్ధతుల ఆధునీకరణ, వ్యవసాయ రుణాల సులభత, మరియు మార్కెట్ లభ్యతపై కేంద్రం దృష్టి సారించింది.ఈ పథకం దేశవ్యాప్తంగా ఉత్పాదకత ఉన్న 100 వ్యవసాయ జిల్లాల్లో అమలులోకి రానుంది.
రైతులకు మెరుగైన విత్తనాలు, నీటి వనరులు, నిల్వ సదుపాయాలు, మరియు శిక్షణ అందించేందుకు కేంద్రం రూ.42,000 కోట్ల నిధులను కేటాయించింది.వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధికి దోహదపడే ఈ పథకం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరచే దిశగా కీలకంగా మారనుంది.