అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరోసారి వాణిజ్య బాంబు పేల్చారు. నవంబర్ 1, 2025 నుంచి చైనా నుండి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై 100 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే ఉన్న 30 శాతం సుంకాలకు ఇది అదనంగా ఉండబోతోంది. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా చైనా తరఫున ప్రపంచ దేశాలకు పంపిన “శత్రుత్వపూరిత లేఖ”ను పేర్కొన్నారు. అంతేకాకుండా, అత్యవసర సాఫ్ట్వేర్లపై ఎగుమతి నియంత్రణలు కూడా అమలులోకి రానున్నాయి.
ఈ చర్యలతో అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లు ఇప్పటికే ప్రభావితమవుతున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది