కాకినాడలో నేడు వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమ పోస్టర్‌ను పార్టీ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చిన ఆలోచన ప్రజా వ్యతిరేకమని, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.
కన్నబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకురావడం, ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తి చేయడం మాజీ సీఎం వైఎస్ జగన్ ఘనత అని తెలిపారు.
కాకినాడ జిల్లా ప్రజలు ఈ ఉద్యమాన్ని ఉత్సాహంగా స్వీకరించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఈ ఉద్యమం, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.