నంద్యాల: అక్టోబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అనంతరం నంద్యాలలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ పర్యటన విజయవంతం చేయడానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
సన్నిపెంటలో హెలిపాడ్ నిర్మాణం, రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, పార్కింగ్ వంటి ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
శ్రీశైలంలో భ్రమరాంబ గెస్ట్ హౌస్ వద్ద మెడికల్ టీములు, గ్రీన్ రూమ్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ పర్యటన నంద్యాల జిల్లాకు ప్రాధాన్యతను తీసుకురానుంది.