ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:20కి కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, రోడ్డుమార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌హౌస్‌కు వెళ్లనున్నారు.
అక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని, మధ్యాహ్నం 2:30 గంటలకు ఓర్వకల్లు మండలంలోని నన్నూరులో రాగమయూరి గ్రీన్‌హిల్స్ వెంచర్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు.