రంగారెడ్డి:తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ‘ఇంటోనోవ్’ విజయవంతంగా ల్యాండింగ్ కావడం విమానయాన రంగానికి గర్వకారణం.
1,81,000 కిలోల బరువుతో, నాలుగు శక్తివంతమైన టర్బోఫ్యాన్ ఇంజిన్లతో కూడిన ఈ విమానం ప్రత్యేకంగా భారీ కార్గో రవాణాకు రూపొందించబడింది. 6,760 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న వింగ్స్, లాంగ్ ట్రక్కులు నేరుగా లోడింగ్, అన్లోడింగ్ చేసుకునే ర్యాంపులు వంటి సౌకర్యాలు దీని ప్రత్యేకత.
సైనిక అవసరాలు, మానవతా సహాయం, ఖండాల మధ్య రవాణా వంటి విస్తృత ప్రయోజనాలతో ఇది ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లో ఉంది. ఈ భారీ విమానం శంషాబాద్లో దిగడం హైదరాబాద్ విమానయాన చరిత్రలో మైలురాయిగా నిలిచింది.