తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే జీవో 9 అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో, సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తదితర నేతలు జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పాల్గొని తదుపరి చట్టపరమైన చర్యలపై చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. త్వరలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుంది.