Home South Zone Telangana భూ కబ్జాదారుడంటూ తనపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించిన మామిడి జనార్ధన్ రెడ్డి|

భూ కబ్జాదారుడంటూ తనపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించిన మామిడి జనార్ధన్ రెడ్డి|

0
13

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని సర్వే నెంబర్ 573, 574 లో ఉన్న ఐదు ఎకరాల స్థల సరిహద్దు వివాదానికి సంబంధించి భూ యాజమాన్య హక్కు కలిగిన మామిడి జనార్దన్ రెడ్డి తనపై వస్తున్న అసత్య ఆరోపణలను ఖండించారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా కాకుండా తప్పుడు పత్రాలను తెరమీదకి తీసుకువచ్చి పలు పత్రికలలో వచ్చిన కథనాల పట్ల ఆయన స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా మామిడి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 1986 నుండి ప్రస్తుత భూ యాజమాన్య హక్కులు తనకే ఉన్నాయంటూ రెవెన్యూ రికార్డుల ప్రకారం, గతంలో న్యాయస్థానాలు కూడా తమకే అనుకూలంగా తీర్పును వెలువరించినట్లు వెల్లడించారు. సదరు ఆరోపణలు చేస్తున్న వ్యక్తి వద్ద భూమికి సంబంధించిన ఎలాంటి ధృవ పత్రాలు, ఆధారాలు లేకపోయినప్పటికీ ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. గతంలో ఇదే భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వే కి సంబంధించి పంచనామా నివేదికలు తమ దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు. అధికారులతో కుమ్మక్కై సదరు వ్యక్తి చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. మున్సిపల్ నియమ నిబంధనలను అనుసరించి నాలా కన్వర్షన్ అయిన అనంతరం పిటి నెంబర్లు సైతం కేటాయించారని అన్నారు. ఆరోపణలు చేస్తున్న వ్యక్తి వద్ద ఏదైనా ఆధారాలు ఉంటే న్యాయపరంగా ముందుకు రావాలని డిమాండ్ చేశారు. భూ సరిహద్దు వివాదానికి తెరపడాలంటే రెవెన్యూ సర్వేకు తాము సిద్ధంగా ఉన్నామని,తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న సదరు వ్యక్తి సర్వేకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు.
Sidhumaroju

NO COMMENTS