విజయవాడలో నేటి నుంచి గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈనెల 19 వరకు కొనసాగనున్న ఈ ఫెస్టివల్‌లో వినియోగదారులకు తగ్గిన GST వివరాలు స్పష్టంగా తెలియజేయనున్నారు.
మోటార్ వాహనాల షోరూమ్‌ల యజమానులు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి, తక్కువ ధరలతో ఆఫర్లు అందిస్తున్నారు. వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్, వాహనాలు వంటి విభాగాల్లో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
వినియోగదారులకు ఒకే చోట అన్ని అవసరాలు తీర్చేలా ఈ ఫెస్టివల్ విజయవాడలో కొనుగోలు ఉత్సాహాన్ని పెంచుతోంది. NTR జిల్లా వాణిజ్య రంగానికి ఇది కొత్త ఊపును తీసుకురానుంది.