అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతి అంశాన్ని ప్రస్తావిస్తూ వార్తల్లో నిలిచారు. గతంలో గాజా ఒప్పందం, ఉత్తర కొరియా చర్చలు వంటి అంశాలను నోబెల్‌కు అర్హతగా ప్రస్తావించిన ట్రంప్ తాజాగా తన ప్రయత్నాలను ప్రపంచం గుర్తించలేదని వ్యాఖ్యానించారు.
తన పాలనలో జరిగిన శాంతి ఒప్పందాలు, బందీల విడుదల వంటి అంశాలను నోబెల్ కమిటీ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, రాజకీయ విమర్శకులు మాత్రం ఇది ట్రంప్ సెల్ఫ్ ప్రమోషన్ మాత్రమేనని ఎద్దేవా చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.