రంజీ ట్రోఫీ 2025–26 సీజన్‌కు బీహార్ జట్టు వైస్ కెప్టెన్‌గా 14 ఏళ్ల వయసులో వాయభవ్ సూర్యవంశీ ఎంపిక కావడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
అండర్–19 వరల్డ్‌కప్‌కు ముందు రెండు రౌండ్లకు మాత్రమే ఈ నియామకం జరిగిందని బీహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టూర్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సూర్యవంశీ, IPL శతకం నమోదు చేసిన యువ ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు.
బీహార్ జట్టుకు నాయకత్వం వహించనున్న సాకిబుల్ గని పక్కన ఉపనేతగా సూర్యవంశీ ఎంపిక కావడం, యువతకు ప్రేరణగా నిలుస్తోంది. పాట్నా నగరానికి చెందిన ఈ యువ క్రికెటర్‌కి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.