ఇండియా సార్వభౌమ ఏఐ మోడల్స్ అభివృద్ధికి కీలకంగా మారే విధంగా ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) కీలక నిర్ణయం తీసుకుంది.
దేశీయంగా అభివృద్ధి చేస్తున్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) కోసం లిస్టెడ్ కంపెనీల ఆర్థిక, ఆర్థిక వ్యవస్థ డేటాను అందించేందుకు ICAI సిద్ధమైంది. ఈ డేటా ఆధారంగా భారత ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న AI మోడల్స్‌కి విశ్వసనీయమైన ఫైనాన్షియల్ సమాచారం అందనుంది.
ఈ ప్రాజెక్ట్‌ను ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరిలో జరిగే India AI Impact Summitకు ముందు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ICAIకి నాలుగు లక్షలకుపైగా సభ్యులు ఉండటం, దేశ ఆర్థిక వ్యవస్థలో ICAI పాత్రను మరింత బలంగా చూపిస్తోంది.