ఈనెల 16న కర్నూలు, నంద్యాలలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన జరగనుంది. ఈ పర్యటన నేపథ్యంలో కర్నూలులో భద్రతా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
నేడు జరగాల్సిన గ్రీవెన్స్ సెల్‌ను అధికారులు రద్దు చేశారు. ప్రధాని పర్యటనకు సంబంధించి మరికొందరు ఎస్పీజీ అధికారులు కర్నూలుకు చేరుకున్నారు. ఇప్పటికే ఐదు హెలిపాడ్లు సిద్ధంగా ఉండగా, హెలికాఫ్టర్ల ట్రయల్ రన్ కూడా పూర్తయింది.
ప్రధాని పర్యటన సందర్భంగా ప్రజా సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభాలు జరిగే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా ప్రజలు ఈ పర్యటనపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.