అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ను ప్రకటించారు.
గాజా ceasefire ఒప్పందాన్ని కుదిర్చి, బందీల విడుదలకు కృషి చేసినందుకు ఈ పురస్కారం ఇవ్వనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ ప్రకటించారు. ట్రంప్ మద్దతుతో మధ్యప్రాచ్యంలో శాంతి, సహకారానికి మార్గం సుగమమయ్యిందని హెర్జోగ్ పేర్కొన్నారు.
త్వరలో సమయం, వేదిక నిర్ణయించి ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ఇజ్రాయెల్ పౌర పురస్కార చరిత్రలో ట్రంప్ పేరు చిరస్థాయిగా నిలవనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.