Home International పాక్-అఫ్ఘాన్ ఘర్షణ.. సరిహద్దుల్లో ఉద్రిక్తత |

పాక్-అఫ్ఘాన్ ఘర్షణ.. సరిహద్దుల్లో ఉద్రిక్తత |

0

అఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అఫ్ఘాన్ తాలిబాన్ సైన్యం చేపట్టిన రాత్రి దాడుల్లో 58 మంది పాక్ సైనికులు మృతి చెందినట్లు అఫ్ఘాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు.

పాక్ సైన్యం మాత్రం 23 మంది మృతి చెందినట్లు పేర్కొంది. ఈ ఘర్షణలో 25 పాక్ ఆర్మీ పోస్టులను తాలిబాన్ ఆక్రమించినట్లు సమాచారం. పాక్ ప్రభుత్వం తాలిబాన్‌ శిబిరాలపై ప్రతీకార దాడులు జరిపింది. ఈ పరిణామాలపై సౌదీ, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం ప్రారంభించాయి.

కాబూల్, పక్తికా ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగిన నేపథ్యంలో ఈ ఘర్షణలు మరింత తీవ్రతరం అయ్యాయి. అంతర్జాతీయంగా ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

NO COMMENTS

Exit mobile version