అమెరికాలో ట్రంప్ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఖర్చులపై డెమోక్రాట్లు, రిపబ్లికన్లు మధ్య తలెత్తిన విభేదాలతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌కు గురైంది.
వేలాది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడగా, ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ ప్రేరణతో కూడినవని కోర్టులు వ్యాఖ్యానించాయి.
డెమోక్రాట్లు ఆరోపిస్తున్న విధంగా, “డెమోక్రాట్ ఏజెన్సీలను లక్ష్యంగా చేసుకుని” ఉద్యోగాల తొలగింపులు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలు ట్రంప్ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు భావనను పెంచుతున్నాయి.