హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో BRS పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు చేర్చారని ఆరోపించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు చెప్పి మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టే విధంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
BRS పార్టీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తుందని, దొంగ ఓట్లపై ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.