తెలంగాణలో ఈ ఏడాది మిర్చి సాగు తీవ్రంగా తగ్గిపోయింది. గత సీజన్‌లో 2 లక్షల ఎకరాల్లో సాగు జరగగా, ప్రస్తుతం కేవలం 95 వేల ఎకరాల్లోనే సాగు జరిగింది.
పెట్టుబడి పెరగడం, దిగుబడి తగ్గడం, మార్కెట్‌లో ధరలు పడిపోవడం వంటి అంశాలు రైతులను వెనక్కి నెట్టాయి. అక్టోబర్ చివరితో మిర్చి సీజన్ ముగియనున్న నేపథ్యంలో, రైతులు కొత్త పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
మిర్చి సాగు తగ్గడం వల్ల మార్కెట్‌లో సరఫరా తగ్గి, ధరలు పెరగవచ్చన్న అంచనాలు ఉన్నా, రైతుల నష్టాన్ని భర్తీ చేయడం కష్టమేనని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా కనిపిస్తోంది.