రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు సమర్పించిన రైతుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
అమరావతి ప్రాంత రైతులు అభివృద్ధి కోసం తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన విధానం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతులు భూములు సమర్పించడం, భవిష్యత్ తరాలకు అభివృద్ధి మార్గం వేయడం గొప్ప త్యాగమని సీఎం అభిప్రాయపడ్డారు.
అమరావతి అభివృద్ధి పునఃప్రారంభానికి రైతుల మద్దతు కీలకమని, వారి ఆశయాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.