చిత్తూరు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) విద్యార్థుల భద్రత, మానసిక దృఢత్వం కోసం ‘పోలీస్ అక్కలు’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎస్పీ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమంలో వారంలో ఒకరోజు మహిళా పోలీసులు విద్యార్థులతో సమయం గడుపుతూ, భద్రత చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు.
ప్రత్యేక క్లాసుల ద్వారా బాలికల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల భద్రతకు అండగా నిలుస్తోంది. చిత్తూరు జిల్లాలో ఇది మోడల్‌గా మారుతోంది.