హైదరాబాద్ నగర రోడ్ల సమస్యల పరిష్కారానికి పురపాలక శాఖ ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తోంది. ‘పబ్లిక్ సేఫ్టీ యాప్’ ద్వారా ప్రజలు రోడ్లపై గుంతలు, రోడ్ల కటింగ్, ఫుట్‌పాత్ సమస్యలు, వ్యర్థాలపై ఫిర్యాదు చేయవచ్చు.
యాప్‌లో సమస్య ఫొటోను అప్లోడ్ చేసి, సంబంధిత AEకి నేరుగా చేరేలా వ్యవస్థను రూపొందించారు. నగరాన్ని 30 సర్కిళ్లుగా విభజించి, ప్రతి సర్కిల్‌కు ఒక AE బాధ్యతలు చేపట్టారు.
ప్రజల భద్రత, నగర శుభ్రత, రవాణా సౌలభ్యం మెరుగుపరచడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషించనుంది. హైదరాబాద్ నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ఈ డిజిటల్ పరిష్కారం మోడల్‌గా మారుతోంది.