హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు ఉపసంహరణకు గడువు ఉంది.
షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఫలితాలు ప్రకటించనున్నారు. రాజకీయంగా కీలకమైన ఈ ఉపఎన్నికపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి.
అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలతో జూబ్లీహిల్స్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. హైదరాబాద్ జిల్లాలో ఈ ఎన్నికలు ప్రజల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.