కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దిగుమతి సుంకాల తగ్గింపు నిర్ణయం పత్తి, ఆయిల్ పామ్ రైతులను తీవ్రంగా నష్టపర్చుతోంది. విదేశీ పత్తిపై సుంకం ఎత్తివేయడంతో దేశీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గిపోయింది.
వ్యాపారులు ఆర్డర్లు తగ్గించడంతో పత్తి ధరలు పడిపోయాయి. అదే విధంగా ఆయిల్ పామ్ గెలల రేట్లు కూడా కేంద్ర ట్రేడ్ పాలసీల ప్రభావంతో తగ్గాయి. రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మంత్రి తుమ్మల ఈ నిర్ణయాన్ని అన్యాయంగా అభివర్ణించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం తక్షణమే నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది.