మేడారం జాతర ప్రాంతాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క సందర్శించారు. సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్న అనంతరం మేడారం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జాతర ఏర్పాట్లు, రహదారి, నీటి సరఫరా, శానిటేషన్ వంటి అంశాలపై సమీక్ష జరిగింది. అయితే దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఈ సమీక్షకు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.
మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు పేర్కొన్నారు. ములుగు జిల్లా ప్రజలు మంత్రుల పర్యటనను స్వాగతించారు.