‘ఓటర్ అధికార్ యాత్ర’ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ‘ఓట్ చోర్- గద్దీ ఛోడ్’ వ్యాఖ్యలపై దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
భాజపా, ఎన్నికల సంఘంపై ఓటు చోరీ ఆరోపణలు చేసిన రాహుల్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, వ్యక్తిగత అభిప్రాయంగా చూడాల్సిన వ్యాఖ్యలపై న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సముచితం కాదని సుప్రీం అభిప్రాయపడింది.
రాజకీయ వేదికలపై వ్యక్తిగత విమర్శలు, నినాదాలు సాధారణమని పేర్కొంటూ, పిటిషన్‌ను విచారణకు అర్హత లేదంటూ తిరస్కరించింది.