గాజాలో రెండు సంవత్సరాల తర్వాత బందీల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. హమాస్ చేతుల్లో ఉన్న ఏడుగురు బందీలను రెడ్ క్రాస్‌కు అప్పగించారు. మిగిలిన బందీలను మరికొంత సమయం తర్వాత విడిపించారు.
ఇప్పటికే రెడ్ క్రాస్ వాహనశ్రేణి గాజాలోని ఖాన్ యూనిస్‌కు చేరుకుంది. బందీలకు స్వాగతం పలుకుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి ప్రత్యేక సందేశం పంపారు. బందీల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈ చర్య గాజా ceasefire ఒప్పందానికి భాగంగా జరిగిందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ పరిణామం శాంతికి దోహదపడనుందని విశ్లేషకుల అభిప్రాయం.