ఆంధ్రప్రదేశ్ డిజిటల్ విప్లవానికి మరో మైలురాయి చేరింది. గూగుల్ సంస్థ విశాఖపట్నంలో 1 గిగావాట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో నిర్మించబోయే ఈ హైపర్‌స్కేల్ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం డేటా నిల్వకే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లోనూ విస్తృత అవకాశాలను కల్పించనుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా 1.8 లక్షల ఉద్యోగాలు సృష్టించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. విశాఖపట్నం ‘AI సిటీ’గా మారేందుకు ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.