అనంతపురం:తాడిపత్రిలో జేసీ కుటుంబం ఆధిపత్యం కోసం తీసుకుంటున్న చర్యలు టీడీపీ లోపలే రాజకీయ తుఫాన్‌కు దారితీస్తున్నాయి. సోమవారం జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, టీడీపీలోని కాకర్ల బ్రదర్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సీఎం సామాజికవర్గానికి చెందిన కాకర్ల రంగనాథ్, జయుడు, రంగనాయకులు గ్రూపు కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ, వారిపై కక్షపూరితంగా వ్యవహరించడం గమనార్హం.
ఈ నిర్ణయం పార్టీ నేతల్లోనే కలకలం రేపింది. జేసీ కుటుంబం తమ నియంత్రణను బలపరచేందుకు సొంత పార్టీలోనే వ్యతిరేక స్వరాలను అణచివేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.