తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రత్యేక లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసింది.
దాదాపు 50 పేజీలతో కూడిన ఈ పిటిషన్‌ను న్యాయ నిపుణులు, సీనియర్ అడ్వకేట్లతో చర్చించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రుల పర్యవేక్షణలో ఫైలింగ్ జరిగింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ శాస్త్రీయంగా చేపట్టామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసును రిఫరెన్స్‌గా పేర్కొంటూ, రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.