Home South Zone Telangana తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ కార్యవర్గ సమావేశం |

తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ కార్యవర్గ సమావేశం |

0
1

సికింద్రాబాద్ :  సికింద్రాబాద్ లోని రాయల్ రేవ్ హోటల్ లో తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం మూలంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్లు అయిందని అన్నారు . ఓటు బ్యాంకు రాజకీయం కోసమే తెలంగాణలోని రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్న చర్యలను వ్యతిరేకించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో పిటిషన్ వేయగా బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకంగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం పట్ల ఆయన స్పష్టత ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లకు, బిసి కులాలకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని, రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలని ఉద్దేశంతోనే కోర్టును ఆశ్రయించామని ఆ అంశాన్ని సైతం రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. దేశంలోనే మహారాష్ట్రలో రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జరిగిన ఎన్నికల మూలంగా ప్రజలు నష్టపోయారని అన్నారు. రాజ్యాంగానికి,సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు తాము కట్టుబడి ఉంటామని వెల్లడించారు.
Sidhumaroju

NO COMMENTS